VIDEO: పాదయాత్రలో భక్తులతో పాటు నడిచిన శునకం
KDP: లింగాల మండలం ఇప్పట్ల గ్రామం నుండి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న భక్తుల వెంట గండి క్షేత్రం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి తిరుమల వరకు ఒక శునకం నడుచుకుంటూ వెళ్ళింది. భక్తులు ఆ శునకాన్ని చూసి, వెంకటేశ్వర స్వామి తమ వెంట తోడుగా వస్తున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. ఆ శునకం భక్తులు ఎక్కడ అన్నం తింటే అక్కడ తింటూ, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటూ వారితోనే ఉంది.