VIDEO: రాఘవాపురం గ్రామసభలో రసాభాస
SRPT: మోతే మండలం రాఘవాపురం గ్రామంలో సర్పంచ్ కోలా లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలపై చర్చ జరుగుతుండగా.. రెండు వర్గాల మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడంతో సభలో ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. అధికారులు,సర్పంచ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.