'దయచేసి మురుగు కాలువ నిర్మించండి'

SRPT: కేతపల్లి మండలం కొత్తపేట గ్రామంలో యాదవ బజార్లో మురుగు కాలు లేకపోవడం వల్ల బురద నీరు రోడ్ల పైకి వస్తుంది దీనివల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని మరియు దుర్వాసన వస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ విషయం గురించి పలమార్లు గ్రామపంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకోలేదని దయచేసి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మురుగు కాలువ నిర్మించాలని వారు కోరుతున్నారు.