'కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి'
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని CPM జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో జరిగిన పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలు నేటికీ నీటి మూటలుగానే మిగిలిపోయాయని విమర్శించారు.