పులి సంచారం.. అటవీ శాఖ హెచ్చరిక

పులి సంచారం.. అటవీ శాఖ హెచ్చరిక

ప్రకాశం: అర్ధవీడు మండలంలో పెద్ద పులుల సంచారం అధికమవడంతో, అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా పశువులను తీసుకెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఒక గేదెపై పులి దాడి చేసి చంపిన సంఘటన నేపథ్యంలో, బాధితుడైన రైతుకు నష్టపరిహారం అందిస్తామని డీఆర్ఎ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విజ్ఞప్తి చేశారు.