ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఇన్‌ఛార్జ్
KDP: తొండూరు మండలం భద్రంపల్లెలో బుధవారం రామాలయ, గంగమ్మ ఆలయాల నిర్మాణాలకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివ మోహన్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, కార్యకర్తలు, అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.