నేడు బేస్తవారిపేటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ సన్యాసిరావు తెలిపారు. బేస్తవారిపేటలో విద్యుత్ లైన్‌లో మరమ్మత్తుల కారణంగా నేటి ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలన్నారు.