వరి పంటలో చీదపీడల నివారణపై అవగాహన కార్యక్రమం
కరీంనగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జగిత్యాల జిల్లా పూడూరు గ్రామంలో వరి పంటలో చీడపీడల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. హరికృష్ణ సల్ఫైడ్ ఇంజురీ, చౌడు నేలల జాగ్రత్తలు వివరించగా, డా. రాజేంద్ర ప్రసాద్ అగ్గి తెగులు, మోగి పురుగు, సూడిదోమ నివారణపై సూచనలు ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి జ్యోతి ఆరుతడి,ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు.