ఉరేసుకుని వాచ్ మెన్ ఆత్మహత్య

ఉరేసుకుని వాచ్ మెన్ ఆత్మహత్య

హనుమకొండ: ఠాణా పరిధి కిషన్ పురలో వాచ్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన రాజేందర్ (45) కిషన్ పురలోని ఓ అపార్ట్‌మెంట్లో వాచ్ మెన్‌గా  పనిచేస్తున్నాడు. వారం క్రితం భార్యాభర్తల మధ్యలో ఘర్షణ జరిగింది. దీంతో రాజేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన అతను గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నాడు.