ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

ATP: గార్లదిన్నె పోలీసులు క్రికెట్ బెట్టింగుపై ఉక్కుపాదం మోపారు. ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.02 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు తెలిపారు. నిందితులు రాజశేఖర్, సుధీర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.