అంగన్వాడీ కేంద్రంలో తనిఖీలు

అంగన్వాడీ కేంద్రంలో తనిఖీలు

AKP: అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్టాక్ తనిఖీ చేశారు. చిన్నారులతో ముచ్చటించి వారితో రైమ్స్ చెప్పించారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా విద్యాబోధన జరగాలన్నారు. వారికి సక్రమంగా పోషకాహారాన్ని అందించాలన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.