జగన్‌మోహిని కేశవ స్వామి వారి నిత్యాన్నదానానికి విరాళం

జగన్‌మోహిని కేశవ స్వామి వారి నిత్యాన్నదానానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీ శ్రీ జగన్‌మోహిని కేశవ స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు దేవరకొండ వినోద్ కార్తీక్ కుటుంబ సభ్యులు రూ.11,116 విరాళాన్ని ఇవాళ అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.