దివ్యాంగుల అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

దివ్యాంగుల అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

SRD: దివ్యాంగుల అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి బుధవారం తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతీభ కనబరిచిన దివ్యాంగులు, దివ్యాంగుల సేవలో కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలు రాష్ట్ర అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులను 17లోపు సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.