రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి: కలెక్టర్

KNR: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రైతుల ముందు శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమం కొత్తపల్లి మండలం బద్దిపల్లి రైతు వేదికలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా వాడడం వల్ల భవిష్యత్ తరాలకు నేల పనికిరాకుండా పోయే అవకాశం ఉందన్నారు.