దొంగతనాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ అరెస్ట్
VSP: గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన రౌడీషీటర్ లోక్‌నాథ్‌ను క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 12 తులాల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ సీ.ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా లోక్‌నాథ్ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.