స్థానిక ఎన్నికలకు వీవీప్యాట్‌లు తప్పనిసరేం కాదు: ఈసీ

స్థానిక ఎన్నికలకు వీవీప్యాట్‌లు తప్పనిసరేం కాదు: ఈసీ

స్థానిక ఎన్నికలకు వీవీప్యాట్‌లు తప్పనిసరేం కాదని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సాంకేతికంగా వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించటం సాధ్యపడదని వివరించింది. అయితే వీవీప్యాట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని విచారణ సందర్భంగా పిటిషనర్ తెలపగా.. అది సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.