మైలవరం జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో

KDP: మైలవరం జలాశయానికి ఇన్ ఫ్లో తగ్గింది. ప్రస్తుతం గండికోట జలాశయం నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. గండికోట జలాశయంలో 25 TMC వరకు నీటిని నిల్వ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మైలవరం జలాశయం ఇన్ ఫ్లో 10 వేల క్యూసెక్కుల నుంచి 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 20.3 TMC నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.