VIDEO: రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
ASF: సిర్పూర్ (టీ) మండలం వేంపల్లి- కాగజనగర్ మధ్యలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురేదురుగా వస్తున్న బైక్, టాటా మ్యాజిక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ వాహనం, బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలైనట్లు తెలిపారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.