'లోక్ అదాలత్ ద్వారా 18,000 కేసుల పరిష్కారం'
ELR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు లోక్ అదాలత్ ద్వారా 18,000 కేసులను రాజీ చేశామని తెలిపారు. గత మూడు నెలల్లో మధ్యవర్తిత్వం ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి 200 కేసులను పరిష్కరించామని స్పష్టం చేశారు. 27 మంది అనాథ బాలలను గుర్తించి వారికి ఆధార్ కార్డులు ఇస్తున్నామన్నారు.