నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న షాప్‌కు జరిమానా
MNCL: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న షాప్ లపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. సోమవారం బెల్లంపల్లిలోని న్యూ ప్రజా వైన్స్ పర్మిట్ రూమ్‌కు ట్రేడ్ లైసెన్స్, ఇతర సదుపాయాలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నందున రూ. 10వేల జరిమానా విధించినట్లు కమిషనర్ సంపత్ రెడ్డి తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే భారీ జరిమానా, షాప్ సీజ్ చేస్తామన్నారు.