రామభద్రపురం సమీపంలో రోడ్డు ప్రమాదం
VZM: రామభద్రపురం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెంటాడ మండలం పోరాంకు చెందిన వ్యక్తి పూడివలసకు చెందిన గౌరి కలిసి రామభద్రపురం నుంచి బాడంగి బైక్‌పై వెళ్తున్నారు. రోడ్డుపై గుంత ఉండడంతో మోటార్ సైకిల్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. గౌరి ఆపస్మారక స్థితిలోకి వెళ్లగా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.