రైల్వేస్టేషన్లో భారీగా బంగారం పట్టివేత

విశాఖ రైల్వేస్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 2.5 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు తనీఖీలు చేపట్టిన కస్టమ్స్ జీఎస్టీ అధికారులు బంగారాన్ని సీజ్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి.. స్మగ్లింగ్ వ్యవహారంపై నిందితుడిని విచారిస్తున్నారు.