CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. పగిడ్యాల మండలం లక్ష్మాపురం, గణపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. జయరాం రెడ్డికి రూ.47,726, సలీం బాషాకు రూ.25 వేలు, శంకరమ్మకు రూ.42 వేల విలువైన చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.