చిన్నారులను ఆదుకోండి సారు..!

చిన్నారులను ఆదుకోండి సారు..!

ASR: హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఆహారం, విద్య వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నాయకుడు చిన్న సోమి తెలిపారు. ప్రభుత్వం, కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ చిన్నారులకు ఆదుకోవాలని ఆయన శుక్రవారం కోరారు.