రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేత

రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేత

VZM: శృంగవరపుకోట మండలంలోని రేగ పుణ్యగిరి గ్రామానికి రోడ్లు కావాలని గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం లక్కవరపుకోట తన క్యాంపు కార్యాలయంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు‌. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి త్వరితగతిన రోడ్లు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు.