వర్షాలతో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

PLD: పల్నాడు జిల్లాలో వర్షాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..విద్యుత్ స్తంభాలు ఉన్న నీటిముంచిన వీధుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.