INSPIRATION: కమలా నెహ్రూ

INSPIRATION: కమలా నెహ్రూ

భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ. ఆమె స్వతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. మహిళా ఉద్యమాలను ప్రోత్సహించి, మహిళలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆమె సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. స్వాతంత్ర్యం కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి గొప్ప త్యాగాలను చేశారు. దేశ ప్రజలకు ఆమె ఒక స్ఫూర్తి.