పుట్టపర్తిలో మోస్తరు వర్షం
సత్యసాయి: జిల్లాలో మోస్తరు వర్షం పడుతోంది. పుట్టపర్తిలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. కాసేపటి క్రితం నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిరు వ్యాపారులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.