VIDEO: రోడ్ షోలో పాల్గొనడానికి బయలుదేరిన కేటీఆర్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. షేక్ పేట్ రోడ్ షోలో పాల్గొనడానికి నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరారు. ఈ సందర్భంగా మహిళలు కేటీఆర్‌కు హారతి ఇచ్చి తిలకం దిద్దారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 9 వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే.