మహిళల క్రికెట్ జట్టుకు మోదీ సన్మానం
ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలుసుకుంది. ఈ సందర్భంగా మోదీ క్రీడాకారిణులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్లేయర్లను సన్మానించి, వారితో కలిసి ఫొటోలు కూడా తీసుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లో గాయపడిన ప్రతికా రావల్ వీల్ ఛైర్‌లో ఈ కార్యక్రమానికి హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది.