'ప్రతి నెల 10వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి'
MNCL: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల 10వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా CHPలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏరియా GMకు వినతిపత్రం అందజేశారు. సకాలంలో వేతనాలు అందక కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి 10వ తేదీలోపు వేతనాలు చెల్లించారు.