తొండూరులో పల్లె నిద్ర చేసిన సీఐ

తొండూరులో  పల్లె నిద్ర చేసిన  సీఐ

KDP: తొండూరు మల్లేలలో ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల రూరల్ సీఐ రమణ, ఎస్సై మద్దిలేటి పల్లె నిద్ర చేశారు. సీఐ రమణ మాట్లాడుతూ..గ్రామాలలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, మద్యం– గంజాయి దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు.