వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశం

వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశం

WNP: వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత అన్నారు. ఈ నెల 21 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌తో సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు.