'ప్రజల సొమ్ము కుక్కల పాలు'

నల్లగొండలోని కుక్క పిల్లలను ప్రజలకు అడాప్షన్ ఇచ్చే కార్యక్రమం శనివారం నిర్వహించారు. పట్టణంలోని రాంనగర్ పార్క్‌లో డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్, స్టేజి, ఇతరత్రా దాదాపు రూ. 7 లక్షలు ఖర్చు చేసినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. దీంతో పట్టణ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యిందని, ప్రజల సొమ్ము కుక్కల పాలు అవ్వడమంటే ఇదేనేమో ఆని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.