ఫోరాంలో గడ్డివాము దగ్ధం

VZM: మెంటాడ మండలం పోరాం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ట్రాక్టర్ల గడ్డి దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వి రవిప్రసాద్ చెప్పారు. అజాగ్రత్తగా సిగరెట్ కాల్చి విసిరేసిన కారణంగా ప్రమాదం సంభవించిందని చెప్పారు. ప్రమాదంలో టి.గోవింద్‌కి చెందిన 40 వేల రూపాయల విలువ గల గడ్డి కాలిపోయినట్లు చెప్పారు.