కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
WNP: మదనాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన పేదవారికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.