అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివి: ఎంపీ

WGL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివి అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇవాళ హనుమకొండ జిల్లా కేంద్రంలోని CSR గార్డెన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నద్ధ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్థనపేట్ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పాల్గొన్నారు.