బెల్ట్ షాపులను నివారించే వరకు విశ్రమించవద్దు: మున్సిపల్ చైర్మన్

నల్గొండ: బెల్ట్ షాపులను నివారించే వరకు విశ్రమించవద్దని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొని బెల్ట్ షాపులను నివారించేందుకు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ఆర్థిక స్వావలంబనతో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని అన్నారు.