రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

HYD: కేపీహెచ్బీ మెట్రోస్టేషన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ బి.సంతోష్ దుర్మరణం పాలయ్యారు. నీళ్లు నింపుతున్న సమయంలో మియాపూర్ వైపు వెళ్తున్న కారు, ట్యాంకర్ను బలంగా ఢీకొట్టడంతో సంతోష్ ట్యాంకర్, కారు మధ్యలో ఇరుక్కుని మృతి చెందారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.