రామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ

రామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ

కామారెడ్డి: రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.ప్రభు కిరణ్ సందర్శించారు. ఇన్ పేషెంట్ వార్డ్, ఫార్మసీ, ల్యాబ్ గదులను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.