అమెరికా అవమానపడేవరకు యుద్ధమే: ఇరాన్
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తిప్పికొట్టింది. అమెరికా అవమానానికి గురై, పశ్చాత్తాపపడి, లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న ట్రంప్ వాదనలను ఖండించింది. తమ దేశ సైనిక బలంపై అమెరికా నిఘా వర్గాలకు పూర్తిస్థాయి సమాచారం లేదని పేర్కొంది.