VIDEO: ప్రజల భద్రతకి ముప్పుగా మారిన ట్రాన్స్‌ఫార్మర్

MBNR: మూసాపేట మండలం దాసరి పల్లి గ్రామంలోని ప్రధాన రోడ్డు పక్కన గల ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని గ్రామస్థులు తెలిపారు. వర్షకాలంలో కావడంతో దాని చుట్టూ కంచె లేకపోవడంతో నిత్యం రాకపోకలు కొనసాగించే ప్రజలకు, మేతకి సంచరించే పశువులకు పెను ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.