అక్కన్నపేటలో కొనసాగుతున్న భూముల రి సర్వే
MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో భూభారతి రెవెన్యూ భూముల రిసర్వే కార్యక్రమం కొనసాగుతుంది. గత పది రోజులుగా రెండు బృందాలుగా ఏర్పడిన రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పైలెట్ గ్రామపంచాయతీగా తీసుకొని భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 25 ఎకరాల భూమి హద్దులు నిర్ధారించారు.