శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఒక గేట్‌ని 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 68,691 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 90,293 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా శ్రీశైలం గేట్లను ఎత్తడం ఈ ఏడాదిలో ఇది ఏడో సారి.