మైసూరు రైలుకు కొత్తవలసలో హాల్ట్
VZM: రైలు నంబరు 06251/52 మైసూరు న్యూ జలపాయిగురి జంక్షన్ మైసూరు మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 17, 24 తేదీల్లో మైసూరులో ప్రతి శుక్రవారం 04:40 గంటలకు బయలుదేరి శనివారం మధ్యాహ్నం 03:10గంటలకు కొత్తవలసకు వస్తుందన్నారు. న్యూ జలపాయిగురి జంక్షన్‌లో 20, 27 తేదీల్లో ప్రతి సోమవారం 04:45గంటలకు బయలుదేరి మంగళవారం 04:30కి కొత్తవలసకు వస్తుందన్నారు.