VIDEO: కోటిపల్లి రేవులో పంటు ధర రెట్టింపు.. భక్తులపై భారం

VIDEO: కోటిపల్లి రేవులో పంటు ధర రెట్టింపు.. భక్తులపై భారం

కోనసీమ: మహా శివరాత్రి వేళ కోటిపల్లి వెళ్ళే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు వద్ద పంటు ధరలు విపరీతంగా పెంచేయడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. సాధారణ రోజుల కన్నా టికెట్ ధర రెట్టింపు చేయడం దారుణం అంటున్నారు. దేవుడు దర్శనానికి వెళ్తే పుణ్యం మాట అలా ఉంచితే జేబులు గుల్ల అవుతున్నాయి అని భక్తులు మండిపడుతున్నారు.