రైతుబంధు డబ్బులు చెల్లించాలని ఆందోళన

రైతుబంధు డబ్బులు చెల్లించాలని ఆందోళన

MNCL: రైతుబంధు డబ్బులు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు ఆందోళన నిర్వహించారు. శనివారం దండేపల్లిలోని ప్రధాన రహదారిపై వారు బైఠాయించి ఆందోళన చేశారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిండిపోయాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి విజిత్ రావు మాట్లాడుతూ.. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్న రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వకపోవడం సరికాదన్నారు.