పాఠశాలల్లో మహిళా భద్రతపై పోలీసుల అవగాహన
కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోలీసులు 'మహిళా భద్రత'పై విస్తృత అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా మోసాలు, బాల్యవివాహాల నష్టాలపై విద్యార్థులను చైతన్యం చేశారు. ఆపదలో డయల్ 100,112,1098, 181,1930 నెంబర్లను వినియోగించుకోవాలని వారు సూచించారు.