బాపులపాడు : ఆలయానికి విరాళం అందజేత
కృష్ణా: బాపులపాడులోని భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో అయ్యప్ప స్వామి కొత్త దేవాలయం నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణానికి హనుమాన్ జంక్షన్‌కు చెందిన మద్దుల నాగరాజు–లక్ష్మీ దంపతులు రూ.50,116 విరాళం మంగళవారం రాత్రి అందించారు. వారి సేవాభావాన్ని ఆలయ కమిటీ అభినందించింది.