నేడు డయల్ యువర్ డీఎం

BHPL: శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆమంచ ఇందు తెలిపారు. డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు 99592 26707 నంబర్‌కు ఫోన్ చేసి అమూల్య మైన సలహాలు, సూచనలు అందజేసి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.